Suspicious Death | అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..దుబాయి నుంచి వచ్చిన 20 రోజుల్లోనే ఘటన
Suspicious Death | పొట్ట తిప్పల కోసం కొన్నేళ్ల పాటు దుబాయి వెళ్లి 20 రోజుల కిందటే ఇంటికి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి శివారులో కలకలం రేపింది.
తిమ్మాపూర్ : పొట్ట తిప్పల కోసం కొన్నేళ్ల పాటు దుబాయి ( Dubai ) వెళ్లి 20 రోజుల కిందటే ఇంటికి వచ్చిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ( Suspicious Death ) మృతి చెందడం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి శివారులో కలకలం రేపింది. తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బనక చందు (30) అనే యువకుడు ఇటీవల దుబాయి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు
. ఈ క్రమంలో బుధవారం ఉదయం చందుకు ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మధ్యాహ్నం మల్లాపూర్, మన్నెంపల్లి శివారు డీ4 కెనాల్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెంది స్థానికులకు కనిపించాడు. చందు శరీరంపై గాయాలు ఉండడంతో తన కుమారుడిని చంపి కెనాల్ లో పడి వేసారంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
సంఘటన స్థలానికి తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ చేరుకొని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

