Bajaj Pulsar | న్యూఢిల్లీ, మే 3: దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్ బైకును పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్400 జెడ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
373సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 39.4 బీహెచ్పీ శక్తినివ్వనున్నది. డ్యూక్ 390, ట్ర యంఫ్ 400, అపాచీ 310, హ్యార్లీ 440లకు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డామినర్ 400 కంటే రూ.46 వేలు తక్కువకే సంస్థ ఈ బైకును అందిస్తున్నది.