Iran warning | ఖమేనీ మృతికి భారీ మూల్యం చెల్లించక తప్పదు.. డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Iran warning | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని (Ali Larijani) హెచ్చరించారు.
Iran warning : ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) మృతికి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని (Ali Larijani) హెచ్చరించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన.. తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.
తాము ట్రంప్‌ను వదిలిపెట్టమని, ఖమేనీ మృతికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లారిజాని పేర్కొన్నారు. దాడుల్లో తమ నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది సాధారణ విషయం కాదని, దీనికి తగిన రీతిలో తాము ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ఈ యుద్ధంలో తాము అనేక మంది అమెరికన్ సైనికులను బంధించామని అలీ లారిజాని మరో పోస్టులో పేర్కొన్నారు.
బంధీలను జైళ్లలో ఉంచినట్లు తెలిపారు. ఇరాన్ దాడుల్లో కేవలం ఆరుగురు యూఎస్ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నిజానికి చాలామంది చనిపోయారని తెలిపారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మృతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులపై లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోని యూఎస్ బలగాలు బంధీగా తీసుకెళ్లిన విషయాన్ని లారిజాని ప్రస్తావించారు. వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని, కానీ అది విఫలమైందని అన్నారు. అయితే యూఎస్ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనమని సెంటాకామ్ ప్రతినిధి మీడియాతో అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

