దేశీయ మార్కెట్‌కు నయా పల్సర్ బైకును పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్400 జెడ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ బైకులను తీసుకొచ్చింది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనమైన పల్సర్‌లో సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది బజాజ్ ఆటో. పల్సర్ ఎన్ఎస్ సిరీస్‌ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కలర్స్, నూతన అవతార్‌గా తీర్చిదిద్�