దిలావర్పూర్, మార్చి 15 : గ్రామ పంచాయతీ కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే పల్లెల్లో పారిశుధ్య సమస్యలు ఉండవని నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రమైన దిలావర్పూర్ ఆరోగ్య కేంద్రంలో ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం పంచాయతీ కార్మికులు, కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు పాల్ధే అక్షర, ఎంపీవో గోవర్ధర్, పంచాయతీ కార్యదర్శులు సునీల్, శ్రావణ్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.