KTR | యువతను కాంగ్రెస్, బీజేపీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అది జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్. చట్ట సభల్లో పెట్టిన జాబ్ క్యాలెండర్ కూడా దిక్కు లేదన్నారు. జాబ్ క్యాలెండర్, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని మనస్తాపంతో, ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణు కుమార్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసిందే.
ఈ క్రమంలో తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్వేదంలో ఉన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏమైంది..? డిప్యూటీ సీఎం ఇలాకాలో యువకుడు లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు.కాంగ్రెస్ హామీ ఏమైందని యువకుడు ప్రశ్నించాడు. పిల్లలు ఇక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు..?ఇంజనీర్లు క్రిమినల్ వేస్టు అని రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా దాటలేదన్నారు కేటీఆర్ .
మీ చేతగాని అసమర్థ పాలనకు ఒక ఛార్జిషీట్ ఈ సూసైడ్ నోట్.ఆ పిల్లాడి సూసైడ్ నోట్ చూస్తే బాధ కలిగింది. నిరుద్యోగులు దయచేసి బలవన్మరణాలకు పాల్పడవద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేస్తాం.దయచేసి తనువులు చాలించకండి.విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికినట్టుగా రాహుల్ పోజులు.మీ ముఖ్యమంత్రి ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నాడు.రేవంత్ వ్యాఖ్యలపై రాహుల్ ఉలకడు పలకడు.రాహుల్‌కు, రేవంత్‌కు విద్యార్థుల ముందుకొచ్చి మాట్లాడే దమ్ములేదు. ఇతర రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే రాహుల్ పరిగెత్తుకొని పోతాడు.కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లాఠీఛార్జీలు జరిగితే మాత్రం రాడు.ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అంటే అందరం బాధపడ్డమన్నారు కేటీఆర్ .
ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా..?
విదేశాల్లో పనిచేస్తున్న మన ఇంజనీర్లు క్రిమినల్ వేస్టా..? రాహుల్ గాంధీ, రేవంత్ కలిసి ప్రకటించిన డిక్లరేషన్లు క్రిమినల్ వేస్ట్. వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదలడం క్రిమినల్ వేస్ట్.రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం క్రిమినల్ వేస్ట్. మెస్సీతో ఫుట్ బాల్ ఆటకు రూ.100 కోట్లు తగలేయడం క్రిమినల్ వేస్ట్ అన్నారు.
తెలంగాణకు రేవంత్ అనే సన్నాసిని సీఎంగా పెట్టడమే క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ ఏం చదివిండో డౌటే. నకల్ కొట్టి పాసైన బాపతే అయ్యింటుంది.మిస్టర్ రేవంత్.. నీ ఎలక్షన్ ఫామ్ నింపుగలుగుతవా..?నీ జీవితంలో ఒక్క పోటీ పరీక్ష రాసినవా..? ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకు హాజరైనవా..? మేం కష్టపడి చదివినం.. గొప్పగొప్ప యూనివర్సిటీల్లో చదివినం.గోడల మీద సున్నాలేసుకొని బతికినోడివి నువ్వు.నీకే అంతుంటే.. ఇంజనీర్లకు ఎంతుండాలి..?హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు కట్టిందెవరు..? ఇంజనీర్లు కాదా..?ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ చేస్తున్నది ఇంజనీర్లు కాదా..?నువ్వు కూసునే కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టింది ఇంజనీర్లు కాదా..?ఇంజనీర్లకు కట్టడం తెలుసు.. మీ పార్టీకి సమాధి కట్టడం కూడా తెలుసు.నిరుద్యోగుల తరఫున రేవంత్, రాహుల్‌ను ప్రశ్నిస్తున్న రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారు..? అని అడిగారు.
రాహుల్, రేవంత్ ఎక్కడ చచ్చారు?అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నడపాల్సిందే.నిరుద్యోగుల తరఫున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని నా ప్రార్థన.విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకో. ముందు నీ చేతిలో ఉన్న పని చేయి అని హితవు పలికారు.
వేణు కుమార్ రాసింది సూసైడ్ నోట్ కాదు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఛార్జ్ షీట్
హైదరాబాద్ వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, ఈరోజు పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసుకుంటుంటే ఎందుకు స్పందించడు?
ముఖ్యమంత్రి నిరుద్యోగులను ఎండ్రిన్ తాగండి, చావండి అంటుంటే రాహుల్ గాంధీ ఎందుకు… https://t.co/cDCXD20iJu pic.twitter.com/CYFT4wp5HB
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2026