న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఘటనలు ఇవాళ కూడా లోక్‌సభ(Lok Sabha)ను స్తంభింప చేశాయి. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ సజావుగా సాగనివ్వాలని స్పీకర్.. విపక్ష సభ్యులను కోరారు. కానీ విపక్ష సభ్యులు ఏమాత్రం తగ్గలేదు. నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అయితే ఆందోళనల మధ్యలోనే సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. కేంద్ర సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్లు 2026ను, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ నోటీసులు జారీ చేశారు. కానీ మూజువాణి ఓటు ద్వారా ఆ బిల్లులను ప్రవేశపెట్టారు. బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు విపక్ష సభ్యులు రిజిస్టర్ చేసుకున్నా.. ఆ సమయంలో ఎవరూ మాట్లాడలేదు.
తొలుత స్పీకర్ ఓం బిర్లా సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ 2 గంటలకు వాయిదా వేశారు. కానీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రశ్నోత్తరాల సమయం జరగలేదు. విద్యార్థులపై లాఠీఛార్జ్ అంశంలో అమిత్ షా ప్రకటన చేయాలని కోరుతూ విపక్షాలు ఆందోళన చేశాయి. ఇవాళ సభ ప్రారంభమైన తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లకు లోక్‌సభ స్పీకర్ కంగ్రాట్స్ తెలిపారు. విద్యార్థులపై లాఠీఛార్జ్, అయోధ్య విరాళాల చోరీ అంశాలపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ప్లకార్డులతో ఆందోళన చేపట్టాయి.
Union Minister of State (Independent Charge) of the Ministry of Statistics and Programme Implementation @Rao_InderjitS introduces The Indian Statistical Institute Bill, 2026 in Lok Sabha.
That the Bill to provide for a comprehensive statutory framework to… pic.twitter.com/uR89PRgD87
— SansadTV (@sansad_tv) August 3, 2026