Brazil : ఫిఫా వరల్డ్‌కప్‌లో మెరిసిన బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్లను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత అభిమానులకు బిగ్ షాక్. ఫ్రెండ్లీ మ్యాచ్‌కు కీలక ఆటగాడు దూరమయ్యాడు. అక్టోబర్ 3వ తేదీన సాల్ట్ లేక్ స్టేడియంలో ఇండియాతో ఫ్రెండ్లీ పోరుకు ముందే ఫార్వర్డ్ రఫిన్హ (Riphanha) సేవల్ని కోల్పోయింది బ్రెజిల్. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మైదానంలో మెరిసిన రఫిన్హ గాయపడ్డాడు. దాంతో.. అతడిని స్క్వాడ్ నుంచి తప్పించామని, టీమిండియా మ్యాచ్‌కు అతడు దూరమయ్యాని బ్రెజిల్ ఫుట్‌బాల్ వెల్లడించింది.
స్వదేశంలో భారత్, బ్రెజిల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు మరో మూడు రోజులే ఉంది. ఇప్పటికే ఇరుజట్లు సన్నాహాల్లో ఉండగా.. మంగళవారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బ్రెజిల్ ఫార్వార్డ్ రిఫన్హ తొడ గాయంతో ఇబ్బంది పడ్డాడు. అతడి కుడి తొడ భాగంలో కండరాల్లో వాపు వచ్చింది. అయితే.. కండరాల్లో చీలిక మాత్రం లేదని వైద్య పరీక్షల్లో తెలిసింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అతడిని స్క్వాడ్ నుంచి తప్పించారు. దాంతో, కోల్‌కతాలో అక్టోబర్ 3న మెన్ ఇన్ బ్లూతో మ్యాచ్‌కు రిఫిన్హ అందుబాటులో ఉండడం లేదు. అంతేకాదు ఈ ఫార్వర్డ్ ప్లేయర్ స్థానంలో మరొక ఆటగాడిని బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య ప్రకటించలేదు.
🚨🗣️ 𝗡𝗘𝗪: Barcelona president Joan Laporta SLAMS the international break following Raphinha’s injury with Brazil:
“It’s news that worries us A LOT. We are NOT happy about it.”
“It has already happened with other players, and this is the RISK of these long international… pic.twitter.com/Mzct7UQZkt
— The Touchline | 𝐓 (@TouchlineX) September 30, 2026
ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం అక్టోబర్ 1న భారత్‌కు బ్రెజిల్ బృందం రానుంది. బెంగళూరులో సెప్టెంబర్ 26 పనామా ఆటగాళ్లను సమర్ధంగా నిలువరించిన భారత్ 1-1తో డ్రా చేసుకుంది. అదే ఉత్సాహంతో ప్రపంచంలోనే మేటి మేటి జట్టు, ఐదుసార్లు ఫిఫా వరల్డ్‌కప్ ఛాంపియన్ బ్రెజిల్‌ను నిలువరించేందుకు గుర్ప్రీత్ సింగ్ సంధు సారథ్యంలోని టీమిండియా సిద్ధమవుతోంది.