Rakesh Agarwal : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (Retired IAS Officer) రాకేష్ అగర్వాల్ (Rakesh Agarwal) దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాజధాని భోపాల్ (Bhopal) లోని తన నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతుకోసి చంపేశారు. రక్తమడుగులో విగతజీవిగా పడివున్న ఆయనను చూసి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూరజ్ నగర్లో రాకేష్ అగర్వాల్ దంపతులు నివసిస్తున్నారు. ఉదయం 5 గంటల సమయంలో ఆయన హత్యకు గురైనట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య జరిగిన సమయంలో రాకేష్ అగర్వాల్ భార్య వేరే గదిలో నిద్రిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన జరినప్పటి నుంచి పనిమనిషి కనిపించకుండా పోవడంతో అతడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే అతడిని పనిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.