ఎంజీయూలో రక్తదాన శిబిరం
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రామగిరి, సెప్టెంబర్ 30 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ శిబిరాన్ని ప్రారంభించి, విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యతో పాటు సామాజిక స్పృహ అవసరమని తెలిపారు. శిబిరంలో విద్యార్థులు, అధ్యాపకులు కలిపి 42 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆచార్య విజయ్‌బాబు, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా.మారం వెంకట రమణారెడ్డి, ప్రోగ్రాం అధికారులు డా.షరీఫ్, డా.ఆనంద్, డా.కిరణ్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.
ప్లేస్మెంట్ డ్రైవ్‌లో 16 మందికి ఉద్యోగాలు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఎంపికైన 16 మంది అభ్యర్థులకు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ నియామక పత్రాలు అందజేశారు. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులు ఎంపికైనట్లు ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ హరీష్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ జి.మారేశ్వరరావు, డా.జయంతి, డీన్ ఆచార్య రేఖ పాల్గొన్నారు.

ఎంజీయూలో రక్తదాన శిబిరం
ఏఐతో రసాయన శాస్త్రంలో విప్లవాత్మక మార్పులు
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రసాయన శాస్త్ర పరిశోధనల స్వరూపాన్ని మారుస్తోందని ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు పార్థసారథి అన్నారు. ఎం.ఎన్.ఎస్. బిజినెస్ చైర్ సమర్పించిన మన్నె అచ్చిరెడ్డి స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ ఏఐ ద్వారా ఔషధ అణువుల గుర్తింపు, ప్రభావశీలత అంచనా, ఔషధ రూపకల్పన వంటి ప్రక్రియలను వేగవంతం చేయవచ్చన్నారు. పర్యావరణహిత రసాయన ప్రక్రియలు, తక్కువ వ్యర్థాలు, తక్కువ శక్తి వినియోగానికి ఏఐ దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఫార్మా రంగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ సూచించారు. ఆ కార్యక్రమంలో ఆచార్య వసంత, ఆచార్య అన్నపూర్ణ, ఆచార్య రఘురామారావు, డా. ప్రశాంతి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

