Ambulance | అంబులెన్స్ వస్తుంటే ఖచ్చితంగా దారివ్వాలనే నిబంధనలున్న సంగతి తెలిసిందే. రోడ్డుపై అంబులెన్స్ వస్తుందంటే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా దారిచ్చి అందులో ఉన్న రోగిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలనే సహకరించాలి. అయితే సిరిసిల్లలో పోలీసులు మాత్రం కనీస నిబంధనలను కూడా మరిచిపోయి అతిగా ప్రవర్తించారు.
సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ పరిమితికి మించి భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తామనుకునే వారికి కూడా వాహనాలు అడ్డం పెట్టి ముందుకు వెళ్లకుండా చేశారు. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ సిరిసిల్ల రోడ్డుపై నుంచి వస్తుంటే అక్కడే ఉన్నపోలీసులు సహకరించి దారివ్వాల్సింది పోయి అత్యుత్సాహం ప్రదర్శించారు.
వన్ వే క్లియర్ చేస్తే మేమెళ్లిపోతం కదా.. ఎవడో వస్తే తొవ్వ బంద్ చేస్తరా.. ఏంది..? ఆగమాగం చేస్తున్నరు.. ఆ సంధులో నుంచి పోదామంటే మొత్తం బండ్ పెట్టిర్రు. రెండు దిక్కుల్లో తొవ్వ ఎట్ల బంద్ చేస్తరు.. వన్ సైడ్ క్లియర్ చేయండి.. ఈ మూడేండ్లళ్ల రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు.. మీరిక్కడ రోడ్డు బంద్ చేస్తే ఎట్లా.. ? మేం దవాఖాన్లకు పోవాలి. అత్యవసర సేవలందించాల్సిన అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన దృశ్యాలు రేవంత్ సర్కార్‌లో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పకనే చెబుతున్నాయి.
సిరిసిల్ల రేవంత్ పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్
రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన అంబులెన్స్
నిలదీసిన రోగి కుటుంబ సభ్యులు https://t.co/2J0eJAsHKS pic.twitter.com/k4xgr6T5LD
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!