The Vvaan | బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది వాన్’ (The Vvaan) సినిమా బీహార్‌లో మంచి ఆదరణను పొందుతోంది. ఈ చిత్రంలోని భక్తి ప్రధానమైన వాతావరణం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, సినిమా థియేటర్లను వారు ఒక పవిత్ర ప్రదేశంగా మారుస్తున్నారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సినీ గెలాక్సీ వంటి చారిత్రక సినిమా హాల్స్‌లో ప్రేక్షకులు ఆడిటోరియం లోపలికి వెళ్లేముందు తమ చెప్పులను బయటే విడవడం విశేషం.
ఈ చిత్రంలో దివంగత పద్మభూషణ్ గ్రహీత, బిహార్ కోకిల శారదా సిన్హా ఆలపించిన ‘ఛాత్ మైయా’ భక్తి గీతం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. థియేటర్లలో ఈ పాట వస్తున్న సమయంలో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాగే, సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు థియేటర్ లోపల తోటి ప్రేక్షకులకు తాజా ‘తీకువా’ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా చేతులు జోడించి సినిమాలోని పూజా సన్నివేశాలను చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ సినిమా సెప్టెంబర్ 25, 2026న విడుదలైంది. ప్రాంతీయ సంస్కృతిని, ఛాత్ వేడుకలను ఈ సినిమాలో ఎంతో సహజంగా చూపించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు సాగుతోంది.
Faith becomes the film’s emotional heartbeat ❤️🔥
The deeply moving Chhathi Maiya sequence in #TheVvaan is striking a chord with audiences, beautifully blending devotion, emotion and belief.
The love for the film only keeps growing. 🙏✨ pic.twitter.com/7HOI8C8IfX
— Ramesh Bala (@rameshlaus) September 25, 2026