Cinema News | ఓ ఆత్మ సాగించే ప్రేమకథతో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ‘లవ్మీ’. ’ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం ఈ సినిమా నుంచి ‘స్టుపిడ్ హార్ట్..’ అనే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రచించారు. మనసుకు నచ్చిన అబ్బాయి కనపడగానే ఓ అమ్మాయి హృదయంలో కలిగే మధుర భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. తెలుగు తెరపై ఇప్పటి వరకు రానటువంటి వినూత్నమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామని, హారర్‌తో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఆర్ట్: అవినాష్ కొల్లా, దర్శకత్వం: అరుణ్ భీమవరపు.