Kim Jong Un | న్యూఢిల్లీ: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను సంతోషపెట్టడానికి ఏటా 25 మంది కన్యలను ఎం పిక చేస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 25 మంది కన్యల బృందాన్ని ‘ప్లెజర్ స్కాడ్’ అని పిలుస్తారు. వీరిని ఎంపిక చేసేటపుడు అందంతోపాటు కుటుంబ నేపథ్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ దేశం నుంచి తప్పించుకుని పారిపోయిన యువతి యూన్మి పార్క్ బయటపెట్టిన సంచలన విషయాల్లో ఇదొకటి. ఈ కిమ్ ప్లెజర్ స్కాడ్ కోసం తాను కూడా రెండుసార్లు ప్రయత్నించానని, అయితే తన కుటుంబ నేపథ్యం కారణంగా తాను ఎంపిక కాలేదని ఆమె చెప్పారు.