Boxing | అస్థానా: ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్‌కు 22 పతకాలు ఖాయం చేయగా ఇందులో 12 మహిళల కేటగిరీలోవే కావడం విశేషం. శుక్రవారం జరిగిన పలు విభాగాల సెమీస్ పోటీలలో ఏడుగురు బాక్సర్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.
బ్రిజేష్ (48 కిలోలు) 5-0 తేడాతో తాలైబెక్ (మంగోలియా)ను ఓడించగా రాహుల్ (75 కిలోలు), ఆర్యన్ (92 కిలోలు) చైనా, కిర్గిస్థాన్ ప్రత్యర్థులపై విజయాలు సాధించారు. 60 కేజీల విభాగంలో సాగర్, ఆర్యన్ (51 కిలోలు), యశ్వర్ధన్ (63.5 కిలోలు), ప్రియాన్షు (71 కిలోలు) తుది పోరుకు అర్హత సాధించారు.