అమరావతి : ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబంలో పొలిటికల్ వార్(Political War) నడుస్తుంది. తండ్రి, కూతురు మధ్య మాటల యుద్ధం రాజకీయ ఆసక్తిని పెంచుతుంది . నిన్న, మొన్నటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తో జత కట్టాలని భావించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) చివరి నిమిషంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పవన్‌కల్యాణ్‌పై రోజుకో ఆరోపణలు చేస్తు వస్తున్నారు.
తాజాగా పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనతో అతడి కూతురు (Daughter) క్రాంతి భారతి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తండ్రికి తగు సూచనలు చేసింది. మా నాన్న పద్మనాభం పవన్‌కల్యాణ్‌పై బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. ఆయన వైఖరి ఏంటో నాకూ అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చడం లేదని ఆమె అన్నారు.
వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపించడానికి కష్టపడోచ్చు. కాని పవన్‌కల్యాణ్, ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి మా నాన్నను పవన్ కల్యాణ్‌ను తిట్టడం కోసమే వాడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల అనంతరం మా నాన్న పద్మనాభంను ఎటూ కాకుండా వదిలివేయడం ఖాయమని అన్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ గెలుపు కోసం నావంతుగా కృషి చేస్తానని క్రాంతి భారతి ప్రకటించారు.
కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ స్పందన ఇదే .. |
కూతురు క్రాంతి చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ పద్మనాభం స్పందించారు. నా కూతురు వ్యాఖ్యలకు భయపడను, నా కూతురు నా ప్రాపర్టీ ( Property) కాదు అని అన్నారు. కూతురికి పెళ్లి అవ్వకముందు తన ప్రాపర్టీ.. పెళ్లి అయ్యాక అత్తగారి ప్రాపర్టీ అని పేర్కొన్నారు. నా కూతురు చేత వీడియో రిలీజ్ చేయించారు. ఎవరు బెదిరించినా బెదిరిపోను. జగన్‌కు సేవకుడిగా ఉంటాను. నా కూతురికి నాకు మధ్య చిచ్చు పెట్టాలని చూశారని ఆరోపించారు.