AP CM Jagan | చంద్రబాబుకు ఓటు వేస్తే ప్రభుత్వ పథకాలన్నీ రద్దు : ఏపీ సీఎం జగన్
AP CM Jagan | రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
అమరావతి : రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల (Election) బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ప్రతి పేద కుటుంబానికి లబ్ది చేకూరిందని తెలిపారు. చంద్రబాబు ( Chandra Babu) కు ఓటేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ (Government Schemes) రద్దు అవుతాయని వెల్లడించారు.
14 ఏండ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏ ఒక్క మంచిపైనా చేశారా అంటూ ప్రశ్నించారు. 2014లో కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. రైతులకు రుణ మాఫీ, ఇళ్ల స్థలాలు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఐదేండ్ల పాలనలో రూ. 2.70 లక్షల కోట్లను అన్ని వర్గాల సంక్షేమానికి ఖర్చు చేశామని గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని జగన్ అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

