Football | హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ అంతరజిల్లాల చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి 3-0తో ఆదిలాబాద్‌పై ఘన విజయం సాధించింది.
రంగారెడ్డి తరఫున పటేల్(23ని), లలిత్(43ని), మహావీర్(92ని) గోల్స్ చేశారు. వనపర్తి, కరీంనగర్ మధ్య మూడో స్థానం కోసం జరిగిన పోరు డ్రాగా ముగిసింది.