KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపిస్తేనే మల్కాజ్‌గిరికి బలం చేకూరుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి చేపట్టిన పలు అభివృద్ధి, సేవా కార్యక్రమాలను కేటీఆర్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డి గళం.. మల్కాజ్‌గిరికి బలం చేకూరుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏనాడు ఏమీ చేయని, కనీసం ఈ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ – నారాపల్లి ఫ్లైఓవర్‌ని కూడా పూర్తి చేయలేకపోయిన బీజేపీకి ఓటేయాలా? అని నిలదీశారు. లేక గత ఎన్నికల్లో గెలిపించినప్పటికి.. ఒక్కరోజు కూడా లోక్‌సభలో మల్కాజిగిరి సమస్యల గురించి ప్రస్తావించని కాంగ్రెస్ పార్టీకి మద్దతియ్యలా..? లేక మల్కాజ్గిరి పార్లమెంట్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి.. ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకు ఎంపీగా అవకాశమిచ్చిన బీఆర్ఎస్ పార్టీని బలపరచాలా..? మల్కాజ్గిరి ఓటర్లు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
మన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేసి, దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి. తన తల్లి పేరు మీద మధుర చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 50 వేల మందికి పైగా సేవలందించారు. కేసీఆర్ ఆశీర్వాదంతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి అనే ఒక సామాన్య నాయకుడు.. రాజకీయంగా సీనియర్ నాయకులైన ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి పోటీకి దిగారు. బీజేపీ నుండి ఈటెల రాజేందర్ ఒక వైపు, కాంగ్రెస్ నుండి పట్నం సునీతా రెడ్డి మరో వైపు.. వీళ్ళు ఇద్దరూ మల్కాజ్‌గిరికి చేసిందేమీ లేదు.. చేసేదేమి లేదు. వారిద్దరికి అధికార దాహం తప్ప మరొకటి లేదు. లక్ష్మారెడ్డి గెలిస్తే ఒక సామాన్యుడి గొంతు లోక్‌సభలో వినబడుతుంది. మన మల్కాజ్ గిరి అభివృద్ధి పథాన నిలుస్తుందని కేటీఆర్ తెలిపారు.
🔷 మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఏనాడు ఏమీ చేయని, కనీసం ఈ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ – నారాపల్లి ఫ్లైఓవర్‌ని కూడా పూర్తి చేయలేకపోయిన బీజేపీకి ఓటేయాలా..
🔷 లేక గత ఎన్నికల్లో గెలిపించినప్పటికి.. ఒక్కరోజు కూడా లోక్‌సభలో మల్కాజిగిరి సమస్యల గురించి ప్రస్తావించని కాంగ్రెస్… pic.twitter.com/UoLZja9Iij
— KTR (@KTRBRS) May 3, 2024