Imprisonment | హాస్టల్ విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష
imprisonment | విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినుల భుజాలపై చేతులు వేయడం, వారు బట్టలు మార్చుకునే సమయంలో రహస్యంగా గమనించడం వంటి అసభ్య చర్యలపై బాధితుల నుంచి ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.
Imprisonment | మెదక్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : హాస్టల్లో చదువుతున్న విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు నిందితులకు కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. నిందితులు వాచ్మెన్ స్వామి, అటెండర్ రాజు అని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థినుల భుజాలపై చేతులు వేయడం, వారు బట్టలు మార్చుకునే సమయంలో రహస్యంగా గమనించడం వంటి అసభ్య చర్యలపై బాధితుల నుంచి ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై అప్పటి తూప్రాన్ ఎస్ఐ నాగార్జున గౌడ్ కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన అప్పటి ఐఓలు డీఎస్పీ రాంగోపాల్ రావు, కిరణ్ కుమార్లు పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించారు. ప్రస్తుత ఐఓ గంగారాజు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్య సమర్థవంతంగా వాదనలు వినిపించగా.. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావాలి నిందితులకు చెరో మూడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు చెరో లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.2 లక్షల జరిమానా విధించారు.
ఈ కేసులో కోర్టు లైజనింగ్ ఆఫీసర్ విఠల్, కానిస్టేబుల్ కృష్ణ, సీడీఓ నాగరాజు, భరోసా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శ్వేతా తదితరులు సహకరించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలయ్యను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.
Read Also :
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

