అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లను సక్రమంగా అందించక వృద్ధులు నేలరాలుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు (Chandrababu) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై సీఎస్(CS) కు ఆయన లేఖ రాశారు.
పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం వల్ల గత నెలలో నెలలో 35 మంది, ఇప్పుడు ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారని తెలిపారు. ఈ మారణ హోమానికి ఏ 1 జగన్‌రెడ్డి (Jaganreddy), ఏ2 సీఎస్‌ని ఆరోపించారు. పేదల ప్రాణాలతో రాజకీయం చేయాలనుకోవడం మానుకోవాలని లేఖలో సూచించారు. తక్షణమే ప్రతి లబ్దిదారుడికి ఇంటింటికి పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. లబ్దిదారుల్ని వేదించి అధికార పార్టీకి లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.