మునుగోడు, ఫిబ్రవరి 13 : పౌష్టికాహారం పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామ పంచాయతీల సర్పంచులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సర్పంచ్ పాలకూరి రమాదేవి చైర్మన్గా 11 మంది సభ్యులతో కలిసి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు నాణ్యమైనవి అందజేయాలని, బాలింతలకు సరైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, విద్యార్ధుల తల్లితండ్రులు పాల్గొన్నారు.