ఎల్బీనగర్, ఆగస్టు 04 ః చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తపేట ఫిజిక్స్ జూనియర్ కాలేజీలో ప్రథమ సంవత్సరం విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసారు. ఈ మేరకు చైతన్యపురి పీఎస్‌లో బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సరూర్‌నగర్‌కి చెందిన విద్యార్థి అఖిల్ తేజ (17) కొత్తపేటలోని ఫిజిక్స్ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు.
సోమవారం కాలేజీలో కాలే జీ ఫెస్ట్‌కు సంబంధించిన చర్చ జరుగుతున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడు అఖిల్తేజపై దుర్బాషలాడి దాడికి యత్నించారు. అంతటితో ఆగకుండా సాయం త్రం కళాశాల సమీపంలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు అఖిల్ తేజపై పిడిగుద్దులతో దాడి చేశారు.
ఈ ఘటనలో విద్యార్ధి ము క్కు ఎముక విరగడంతో ఓజోన్ ఆసుపత్రిలో చికిత్సకు తరలించగా శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.దీంతో బాధితుడు ఈ ఘటనకు సీనియర్ విద్యార్థులతో పాటుగా కళాశాల యాజమాన్యం కారణమని ఆరోపిస్తూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు.