న్యూఢిల్లీ: చీఫ్ ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ(CJP) డిమాండ్ చేసింది. ఒకవేళ 48 గంటల్లోగా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయకుంటే, అప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు సీజేపీ తన వార్నింగ్‌లో పేర్కొన్నది. నిరవధిక నిరాహార దీక్షకు దిగినున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిటీసణర్ అతిపెద్ద జాతి వ్యతిరేకి అని, జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, భారత ప్రజాస్వామ్యానికి ఆయన పెను ప్రమాదంగా మారినట్లు అభిజీత్ ఆరోపించారు.
ఎలక్షన్ కమీషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు.. ముఖ్య ఎన్నికల అధికారిపై ఆరోపణలు చేశారు. గడిచిన 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశామని, కానీ పూర్తి స్థాయి ఎలక్షన్ కమిషన్ పేరుతో నిర్ణయాలు తీసుకున్నారని, తమ అనుమతి లేకుండానే ఆ నిర్ణయాలను వెల్లడించారని, సీఈసీ నిర్ణయాలు అక్రమ రీతిలో ఉన్నట్లు ఇద్దరు కమీషనర్లు చేసిన ఆరోపణలపై ఓ మీడియా కథనాన్ని రాసింది. ఈ నేపథ్యంలో సీజేపీ నేతలు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత .. ఎవరికి ఓటు రావాలి, ఎవరికి ఓటు వద్దు అన్ని విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తోందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అంటూ అభిజీత్ ప్రశ్నించారు. సుమారు 3 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, ఇదేమీ చిన్న సంఖ్య కాదు అని, , 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ, విపక్షాల మధ్య తేడా కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే అని, 13 కోట్ల మంది ఓటర్లను డిలీట్ చేయడం అంటే, దాదాపు 13 నుంచి 14 శాతం ఓట్లను తొలిగించడమే అవుతుందని అభిజీత్ అన్నారు. ఆ 2 శాతం వ్యత్యాసాన్ని పెంచేందుకు జ్ఞానేశ్‌కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారా అని కూడా ప్రశ్నించారు.
#WATCH | Delhi: Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke says, “A report concerning the Election Commission that surfaced yesterday proves that Chief Election Commissioner Gyanesh Kumar is the country’s biggest traitor. He is the biggest anti-national in this country,… pic.twitter.com/HfKBMeVpgu
— ANI (@ANI) September 24, 2026