అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో విద్యుదాఘాతం ( Electrocution) తో తల్లీకూతురు మృతి చెందారు. జిల్లాలోని నాతవరంలో ఇంటిలో నివసిస్తూన్న తల్లి మంగ, కూతురు జానకి గురువారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన నాగరాజు అనే యువకుడికి గాయాలు కాగా తీవ్ర గాయాలతో తల్లీకూతురు ( Mother and daughter ) మృతి చెందారు .
ఈ ఘటనపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . తీవ్రంగా గాయపడ్డ నాగరాజుకు మెరుగైన వైద్యం అందిచాలని ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తలరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.