బూర్గంపహాడ్ మండలంలో ఈదురుగాలులకు 250 ఎకరాల్లో నేలవాలిన పత్తి
బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డ పంచాయతీలో వేపలగడ్డ, కొమ్ము నకిరిపేట గ్రామాల్లో ఈదురు గాలులకు సుమారు 200 నుంచి 250 ఎకరాల్లో పత్తి పంట నేలవాలింది. బుధవారం సాయంత్రం నుండి వీచిన బలమైన గాలులకు అంజనాపురం తదితర గ్రామాలకు చెందిన...
– పంటలను పరిశీలించిన ఏవో శంకర్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 24 : బూర్గంపహాడ్ మండలం వేపలగడ్డ పంచాయతీలో వేపలగడ్డ, కొమ్ము నకిరిపేట గ్రామాల్లో ఈదురు గాలులకు సుమారు 200 నుంచి 250 ఎకరాల్లో పత్తి పంట నేలవాలింది. బుధవారం సాయంత్రం నుండి వీచిన బలమైన గాలులకు అంజనాపురం తదితర గ్రామాలకు చెందిన 50 నుండి 60 మంది రైతులకు సంబంధించిన పత్తి పంట కాయదశకు చేరుకునే సమయంలో నేలరాలడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల వ్యవసాయాధికారి శంకర్ గురువారం ఏఈవో వైష్ణవి తదితరులతో వేపలగడ్డ, కొమ్మునకిరిపేట గ్రామాల్లో నేలవాలిన పత్తి పంటను పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపించి అన్నదాతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

బూర్గంపహాడ్ మండలంలో ఈదురుగాలులకు 250 ఎకరాల్లో నేలవాలిన పత్తి
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo | సౌదీపై హౌతీ దాడుల ఎఫెక్ట్.. రియాద్, జెద్దా నుంచి విమానాలు రద్దు చేసిన ఇండిగో
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

