వాషింగ్టన్: గత నెల వింబుల్డన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు షాకిచ్చిన ఫిలిప్పీన్స్ అమ్మాయి అలగ్జాండ్రా ఇయాల మరోసారి సంచలన ప్రదర్శన చేసింది. యూఎస్ ఓపెన్‌కు ముందు వాషింగ్టన్ డీసీలో జరిగిన ముబదల డీసీ ఓపెన్‌లో భాగంగా మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ఇయాల.. 4-6, 6-4, 6-0తో టాప్ సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. డబ్ల్యూటీఏ టూర్ టైటిల్‌ను నెగ్గడం ఆమెకు ఇదే తొలిసారి కావడం విశేషం. అదీగాక ఫిలిప్పీన్స్ ప్లేయర్ డబ్ల్యూటీఏ టూర్ టైటిల్ గెలవడం ఇదే మొదటిసారి. వర్షం కారణంగా రెండ్రోజుల పాటు సాగిన టైటిల్ పోరులో ఈ ఫిలిప్పీన్స్ అమ్మాయి.. తొలి సెట్‌ను కోల్పోయినా తర్వాత పుంజకుని ప్రత్యర్థిని చిత్తుచేసింది. ఈ టోర్నీ క్వార్టర్స్‌లో స్వితోలినా, సెమీస్‌లో ఒసాకాను చిత్తుచేసిన ఇయాల.. ఫైనల్స్‌లో పెగులా పనిపట్టి టైటిల్‌ను దక్కించుకుంది.