హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని రెవ్లాండ్ ఎంఎక్స్ ట్రాక్‌లో ‘హీరో ఎక్స్‌క్లాన్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో ‘హీరో ప్రైమా’, ‘జనప్రియ అప్ స్కేల్’ సహకారంతో నిర్వహించిన ‘హీరో ఎక్స్‌క్లాన్ హైదరాబాద్ ఆఫ్-రోడ్ ట్రైనింగ్, ఎక్స్పీరియన్స్’ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా అడ్వెంచర్ బైక్ రైడర్లు పాల్గొని ఆఫ్-రోడ్డు రైడింగ్‌లో శిక్షణ పొందారు.
రెవ్లాండ్కు చెందిన ప్రొఫెషనల్ ట్రైనర్లు సత్యం, మనీశ్, వేణు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో బాడీ పొజిషనింగ్, థ్రాటిల్ నియంత్రణ, బ్రేకింగ్ టెక్నిక్స్, కార్నరింగ్, అడ్డంకులను అధిగమించడం, వివిధ రకాల భూభాగాల్లో సురక్షితంగా బైక్ నడిపే విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఉదయం అల్పాహారంతో ప్రారంభమైన కార్యక్రమంలో థియరీ సెషన్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ట్రాక్ రైడింగ్ సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశంలో రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ‘విడ కే3’ను రెవ్లాండ్లో అధికారికంగా పరిచయం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలక్ట్రిక్ ఆఫ్-రోడ్ మోటార్ స్పోర్ట్స్ అభివృద్ధికి తమ కట్టుబాటును ఇది ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.