ఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పతకాల పంట పండించి మంగళవారం ఢిల్లీకి చేరుకున్న భారత క్రీడాకారులకు దేశ రాజధానిలో ఘనస్వాగతం లభించింది. ఏడు పసిడి పతకాలు గెలిచిన బాక్సర్లతో పాటు జూడోలో భారత్కు చరిత్రాత్మక స్వర్ణాన్ని అందించిన అస్మితకు ఎయిర్పోర్ట్లో వందలాది అభిమానులు స్వాగతం పలికారు. మెడలో పూలమాలలతో పాటు రూ. 50 నోట్లతో తయారుచేసిన దండ వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అస్మిత స్పందిస్తూ.. ‘జూడోలో దేశానికి గోల్డ్ మెడల్ అందించాలనేది నా కల. గ్లాస్గోకు వెళ్లినప్పుడూ అదే నా మనసులో ఉండేది. భారత్కు వెళ్తే స్వర్ణంతోనే వెళ్లాలి అనుకునేదాన్ని’ అని తెలిపింది.