పావ్‌లు: రెండు , ఆలుగడ్డలు: పెద్దవి రెండు ఉల్లిపాయలు: నాలుగు చిన్నవి క్యారెట్: పెద్దది ఒకటి బీన్స్: పది పన్నెండు పచ్చి బఠాణీ: పావు కప్పు, పచ్చి మిరపకాయలు: రెండు , కొత్తిమీర: అరకట్ట నూనె: టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర: పావు స్పూను చొప్పున పసుపు: అరస్పూను, ఉప్పు: ఒకటిన్నర టీ స్పూను బటర్: చిన్న ప్యాకెట్ లేదా కొద్దిగా వెన్న శనగపిండి: టేబుల్ స్పూన్ వెల్లుల్లి నల్లకారం: టేబుల్ స్పూన్
ఆలుగడ్డల్ని ఉడికించి చెక్కుతీసి పెట్టుకోవాలి. క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఉల్లిగడ్డలను మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. బాణట్లో టేబుల్ స్పూను నూనె వేసి కాగనిచ్చి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇందులో తరిగి పెట్టుకున్న కూరగాయల ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలను కూడా ఇందులో వేసి మెదుపుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పావ్‌ను అడ్డంగా రెండు ముక్కలుగా కోసి కొద్దిగా వెన్న రాసి పెనం మీద రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక సగం పావు మీద ఈ కూరలాంటి మిశ్రమాన్ని మందంగా రాయాలి. దాని మీద శనగపిండిని అద్ది… మళ్లీ పెనం మీద కొద్దిగా వెన్న వేసి పిండి అద్దిన వైపు కాల్చుకోవాలి. ఇప్పుడు చివర్లో వెల్లుల్లి పాయల నల్లకారం చల్లుకొంటే వేడివేడిగా లాగించేలా ప్యాన్ ఫ్రైడ్ వడాపావ్ రెడీ! కావాలంటే ఈ కారం బదులు సాస్తోనూ దీన్ని ఆస్వాదించొచ్చు.