BRS : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) దూకుడు కనబరిచింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాల(65)కే పరిమితం చేస్తూ.. తెలంగాణలో తామే బలమైన ప్రతిపక్షమని చాటుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే రేవంత్ సర్కార్‌కు షాకిస్తూ.. విజయదుందుభి మోగించిన గులాబీ పార్టీ.. పుర పోరులోనూ గట్టి పోటీనిచ్చింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బీఆర్ఎస్ ‘అధికారం కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. ఇక పార్టీ పని అయిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కష్టమే” అని కొన్ని మీడియాలు కోడై కూస్తూ.. ప్రచురించిన కథనాలను తిప్పికొట్టింది బీఆర్ఎస్ క్యాడర్.
మున్సిపల్ ఎన్నికలకు పక్కాగా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విజయవంతమైంది. ఓవైపు సోషల్ మీడియాలోరు గ్యారంటీల అమలును, ప్రభుత్వ తీరును ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసింది. మరోవైపు ప్రజా క్షేత్రంలో సమస్యలను ఎత్తి చూపుతూ ప్రతిపక్ష బాధ్యతను సమర్ధంగా నిర్వహించింది. ఫలితంగా మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని దెబ్బతీసి.. బీ టీమ్ అన్న ముద్ర వెయ్యాలని చూసిన రెండు జాతీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిచ్చింది కారు పార్టీ.
ఇది రికవరీ కాదు… రివైవల్!!
ప్రతిపక్షంలో దుమ్ము రేపిన బీఆర్ఎస్ 🔥
అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాలు, కేవలం 65కే పరిమితం చేస్తూ, బీఆర్ఎస్ తనను తాను స్ట్రాంగ్ అపోజిషన్గా నిలబెట్టుకుంది.
అధికారం కోల్పోయింది,
లోక్‌సభ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చాయి,
“పార్టీ పని… pic.twitter.com/bGfSwbrFNF— Telugu Scribe (@TeluguScribe) February 13, 2026
15 మున్సిపాలిటీలు గెలుపొందడమే కాకుండా 700 వార్డుల్లో, 35 చోట్ల హంగ్ ఏర్పడడం బీఆర్ఎస్ పుంజుకున్న తీరుకు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా తిరుగుతూ భారీ సభలు పెట్టినా.. పోలీసు అంగబలం, అధికార ప్రభావం, ఆర్థిక శక్తిని ఎదుర్కొంటూనే సాధించి ఈ ఫలితాలు బీఆర్ఎస్ క్యాడర్‌కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.