Harish Rao | గుంపు మేస్త్రీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ: హరీశ్ రావు
ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు సాగకూడదంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు.
సిద్దిపేట: ఇవి తెలంగాణ భవిష్యత్, తలరాతను మార్చే ఎన్నికలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల ఆటలు సాగకూడదంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కటే అమలుచేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా అక్కంపేటలో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా హరీశ్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయినట్లు అయిందన్నారు. చెక్‌బౌన్స్ అయితే శిక్ష పడుతుంది.. కాంగ్రెస్ బాండు పేపర్లు బౌన్స్ అయ్యాయి. అందుకు కాంగ్రెస్‌కు శిక్ష పడాలని చెప్పారు.
‘సీఎం రేవంత్ ఇప్పుడు సిగ్గులేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చాక నిత్యావసర వస్తువుల ధరల కొండెక్కాయి. మంచినీళ్లు వస్తలేవు, పింఛన్లు వస్తలేవు. కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ గోవిందా గోవిందా పాటలా మారాయి. దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పింఛను అన్నీ గోవిందా. మహాలక్ష్మి గ్యారంటీ మహా మోసం. ఈ ఎన్నికల్లో వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తాం. ఆయన అభివృద్ధి సాధకుడు. గత ఐదేండ్లలో కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశాడు?, బీజేపీ పదేండ్ల పాలనలో ఉప్పు, పప్పు ధరలు పెరిగాయి.
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష. సాగునీళ్లు, మెడికల్ కాలేజీలు, నిరంతర కరెంటు, కేసీఆర్ కిట్టు.. ఎన్నో సంక్షేమ పథకాలు కేసీఆర్ పాలనలో అమలయ్యాయి. కాంగ్రెస్ అడ్డుకున్నా పట్టుబట్టి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. హస్తం పార్టీ వచ్చాక అంతా రివర్స్ అయింది. కరెంటు మీటర్లు కాలిపోతున్నయ్, రిపేరుకు రూ.10 వేలు ఖర్చవుతోంది. గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చుండు. రేవంత్ చేసిందేమీ లేదు. గుంపు మేస్త్రీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ. గుంపు మేస్త్రీ గూబ పలగాలంటే కారు గుర్తుకు నొక్కాలి. ఎవరు మనకు మేలు చేశారో వాళ్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ముసలోళ్లు కేసీఆర్ ఇచ్చిన కంటివెలుగు కళ్లద్దాలు పెట్టుకుని మూడో నంబరు బటన్ నొక్కాలి.’ అని హరీశ్ రావు అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- B.Vinod Kumar
- Bandi Sanjay
- BJP
- BRS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

