Aa Okkati Adakku | ‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ తో హిట్ కొట్టారా ?
Aa Okkati Adakku Movie Review | ఇటు కామెడీ, అటు సీరియస్ కథలతో అలరించే హీరో అల్లరి నరేష్. కొన్నాళ్ళుగా సీరియస్ కథపై ద్రుష్టి పెట్టిన ఆయన.. తనకు గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ జోనర్ లో 'ఆ ఒక్కటీ అడక్కు'తో ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మల్లి అంకం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
Aa Okkati Adakku Movie Review | ఇటు కామెడీ, అటు సీరియస్ కథలతో అలరించే హీరో అల్లరి నరేష్. కొన్నాళ్ళుగా సీరియస్ కథపై ద్రుష్టి పెట్టిన ఆయన.. తనకు గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ జోనర్ లో ‘ఆ ఒక్కటీ అడక్కు’తో ఇప్పుడు ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మల్లి అంకం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమా కోసం ఈవీవీ క్లాసిక్ టైటిల్ ని వాడుకోవడం మరో విశేషం. మరి ఇంత మంచి క్లాసిక్ టైటిల్ తో వచ్చిన సినిమా ఎలా వుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ : గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధికారి. జీవితంలో స్థిరపడినప్పటికీ తనకి ఇంకా పెళ్లి కాదు. సంబంధాలు వచ్చినట్టే వచ్చి రిజెక్ట్ అవుతుంటాయి. తన తమ్ముడికి కూడా పెళ్లయిపోయింది. కానీ తాను పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూనే వుంటాడు. చివరి ప్రయత్నంగా హ్యాపీ మాట్రిమొనీ ని సంప్రదిస్తాడు. అక్కడివారు చూపిన మ్యాచ్ లో గుణకి సిద్ది (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం అవుతుంది. తొలి చూపులోనే బాగా నచ్చుతుంది. కానీ సిద్దికి మాత్రం తనకు ఇంకా తొమ్మిది ఆప్షన్స్ వున్నాయని, అవన్నీ చూశాకే ఒక నిర్ణయానికి వస్తానని గుణని వెయిటింగ్ లిస్టు లో పెట్టేస్తుంది. మరి సిద్ది, గుణతో పెళ్ళికి అంగీకరించిందా? అసలు సిద్ది ఎవరు ? జీవితంలో సెటిల్ అయిపప్పటికీ గణకి వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది ? చివరికి గణ పెళ్లి చేసుకున్నాడా లేదా ? అనేది మిగతా కథ.
విశ్లేషణ: పెళ్లి అనేది ఒక ఎమోషనల్ బాండ్. ఈ ఎమోషన్ ని క్యాష్ చేసుకొని కొన్ని మ్యాట్రీమొనీ కంపెనీలు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి ? పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండలానే అంశాలని వినోదాత్మకంగా చెబుతూనే మంచి సందేశం ఇచ్చిన చిత్రమిది. గణ పెళ్లి చూపులతో మొదలైన కథ ఆహ్లాదకరమైన నవ్వులు పంచుతూ ముందుకు సాగుతుంది. గణ మాట్రిమొనీలో జాయిన్ అవ్వడం, అక్కడ స్కీములు, హీరోయిన్ పరిచయం, ఇవన్నీ హిలేరియస్ గా ముందుకు సాగుతాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చిన ట్విస్ట్ బావుంది. సెకెండ్ హాఫ్ లో మాట్రిమొనీ పేరుతో జరుగుతున్న మోసాలు ఒకొక్కటీ వెలుగులోకి తీసుకురావడం, హీరో, హీరోయిన్ ఎమోషన్స్, చివర్లో కోర్ట్ రూమ్ డ్రామా ఇవన్నీ ప్రేక్షకులకు వినోదం పంచుతూనే ఆలోజింపచేసేలా వుంటాయి.
నటీనటులు: గణ పాత్రలో నరేష్ లుక్ కొత్తగా హుందాగా వుంటుంది. కామెడీ సీన్స్ లో నవ్విస్తూనే ఎమోషనల్ సీన్స్ లో హత్తుకున్నారు. ఫారియా నరేష్ కి జోడిగా యాప్ట్. అందం అభినమయంతో ఆకట్టుకుంది. నరేష్ మరదలి పాత్రలో నటించిన జామీ లివర్ నవ్వులు పంచింది. మురళీ శర్మ, అజయ్, అనీష్ కురువిల్ల, రాజీవ్ కనకాల, రఘు బాబు, గోపరాజు రమణ పరిధిమేర కనిపించారు. గౌతమి జడ్జ్ గా గెస్ట్ రోల్ పోషించారు.
సాంకేతికంగా: గోపిసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో ఆకర్షణ. పాటలు కలర్ ఫుల్ గా చిత్రీకరించారు, నేపధ్య సంగీతం ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. కెమరాపనితనం బావుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. అబ్బూరి రవి రాసిన మాటలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. దర్శకుడు మల్లి అంకం వినోదంతో పాటు మంచి సందేశం వున్న సినిమా ఇవ్వడం సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ : అల్లరి నరేష్, ఫారియా వినోదం, సందేశం, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ : అక్కడక్కడా కొన్ని రొటీన్ సీన్లు
రేటింగ్: 3/5
Read Today's Latest Reviews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

