KTR Road Show | మేడ్చల్, మే3 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో శనివారం నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కేటీఆర్ రోడ్ షోలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్‌నగర్ చౌరస్తా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్, మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్‌లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, కేపీ.వివేకానంద్, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్‌షోకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.