Hyderabad | నిప్పుల కొలిమి.. హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా 43.6డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగా మారింది.
- రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతలు
- రాష్ట్రంలోనే అత్యల్పంగా నగరంలో 14శాతం తేమ
- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
Hyderabad | సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ) : నగర వేసవి కాల చరిత్రలో శుక్రవారం కొత్త రికార్డు నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడంతో జనం అతలాకుతలమయ్యారు. భానుడు ప్రచ్చండ భానుడిగా మారడంతో గ్రేటర్ అగ్నిగుండంగా మారింది. రోజురోజుకు గ్రేటర్ వాతావరణం ఊహించని రీతిలో మార్పు చెందుతూ తీవ్ర రూపం దాల్చుతున్నది. నగర చరిత్రలోనే ఇప్పటి వరకు పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వలేదంటున్నారు వాతావరణ కేంద్రం అధికారులు. కరోనాకు ముందు గ్రేటర్లో 2015, 2018, 2019లో పలు మార్లు పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్క్‌ను చేరాయి. అదికూడా సీజన్ మొత్తంలో గరిష్ఠంగా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తున్నది.
కానీ ఈ వేసవిలో మాత్రం కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడమే కాకుండా ఇప్పటి వరకు రెండు సార్లు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43డిగ్రీల మార్క్‌ను చేరాయి. అంతేకాకుండా నగర చరిత్రలోనే మొదటిసారిగా ఈనెల 3న పగటి ఉష్ణోగ్రతలు 43డిగ్రీలు దాటి నమోదవ్వడం కొత్త రికార్డుగా చెప్పవచ్చు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43.6డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 14శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అయితే ఒక పక్క పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతుండగా మరో పక్క గాలిలో తేమ శాతం కిందకు పడిపోతున్నది. గాలిలో తేమ శాతం అతి తక్కువకు పడిపోవడం వల్ల పొడిగాలి ఏర్పడి, తీవ్రమైన ఉక్కపోత ఏర్పడుతుంది. హైదరాబాద్‌లోనే గాలిలో తేమ అత్యల్పంగా 14శాతం నమోదుకావడం కూడా రికార్డుగా చెబుతున్నారు.
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
గ్రేటర్ వ్యాప్తంగా తీవ్ర స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడం, దానికి తోడు తేమ శాతం పడిపోవడంతో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

