అమరావతి : ఏపీలో ఎండలు నానాటికి తీవ్రమవుతున్నాయి. ఒక్కరోజు తేడాలోనే ఒక డిగ్రీ సెల్సియస్ పెరగడం ఆందోళన కలిగిస్తుంది . రాష్ట్రంలో నంద్యాల జిల్లా గోసాసడు, బండిఆత్మకూరులో అత్యధికంగా 47.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత (Temperature) నమోదు అయ్యింది . ప్రకాశం జిల్లా అర్దవీడులో 47.3, కడప జిల్లా చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా అక్కమాంబపురంలో 47.1, తిరుపతి(tirupati) జిల్లా పెద్దకన్నాలిలో 46.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8 , చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది . మరో 15 జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం దశాబ్దకాలంలో ఇదే మొదటిసారి . రానున్న 24 గంటల్లో 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 208 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖాధికారులు (Weather officials) తెలిపారు.