రాయపోల్ : రాష్ట్రంలో రేపటి నుంచి పదవ తరగతి పరీక్షలు ( SSC Exams ) ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు శుక్రవారం పరిశీలించారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి ( MEO Rajagopal Reddy ) పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు.
రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , బేగంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాలల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మండలంలోని రెండు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కావలసిన ఫర్నిచర్, త్రాగునీటి వసతి, తరగతి గదులను పరిశీలించారు. రాయపోల్ మండలంలో పదవ తరగతి పరీక్ష రాస్తున్నా ప్రతి విద్యార్థికి ‘విజయీభవ’ అంటూ ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని జిల్లాలోనే మండలాన్ని అగ్రస్థానం ఉంచాలని పేర్కొన్నారు.