Stock Market | రెండు లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు అధికంగా జరగడంతో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు అంతేస్థాయిలో వెనక్కితగ్గాయి. ఇంట్రాడేలో 75 వేల మార్క్‌ను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద స్థిరపడింది.
Stock Market | ముంబై, మే 3: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. టెలికం, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగ షేర్లలో క్రయవిక్రయాలు అధికంగా జరగడంతో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన సూచీలు అంతేస్థాయిలో వెనక్కితగ్గాయి. ఇంట్రాడేలో 75 వేల మార్క్‌ను అధిగమించిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద స్థిరపడింది. కనిష్ఠ స్థాయి నుంచి1,627 పాయింట్ల శ్రేణిలో సూచీ కదలాడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మార్కెట్లను పడేశాయి. సూచీలో హెవీవెయిటేజ్ అయిన ఈ మూడు షేర్లు నష్టాల్లోకి జారుకోవడం సూచీలు నష్టపోవడానికి ప్రధాన కారణమని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఒక దశలో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ 172.35 పాయింట్లు కోల్పోయి 22,475. 85 వద్ద స్థిరపడింది. దీంతో లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. సూచీల్లో ప్రాఫి ట్ బుకింగ్ జరగడంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.2, 25,543.41 కోట్లు కరిగిపోయి రూ.4,06,24,224. 49 కోట్లు(4.89 ట్రిలియన్ డాలర్లు) వద్ద నిలిచింది.
- ఎల్అండ్టీ, మారుతి, భారతీ ఎయిర్టెల్, నెస్లె, రిలయన్స్ షేర్లు రెండు శాతానికి పైగా కోల్పోయాయి.
- జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కొటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటర్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీలు ఒక్క శాతానికి పైగా నష్టపోయాయి.
- వీటితోపాటు టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాం క్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, టీసీఎస్, విప్రో షేర్లు తగ్గాయి.
- బజాజ్‌ఫైనాన్స్, బజాజ్‌ఫిన్‌సర్వ్, మహీం ద్రా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా చూస్తే టెలికమ్యూనికేషన్, రియల్టీ, సర్వీసులు, టెక్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటీ, కమోడిటీస్ షేర్లు నష్టపోగా..హెల్త్‌కేర్, మెటల్ రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 147.99 పాయింట్లు, నిఫ్టీ 55.9 పాయింట్లు చొప్పున బలపడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

