Pawan Kalyan | జనం భూములను దోచుకోవడానికే జగన్ కొత్త చట్టం : పవన్‌కల్యాణ్
Pawan Kalyan | ఏపీలో తీసుకొస్తున్న ల్యాండ్ టైటిలింగ్(Land Titoling Act) చట్టంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
అమరావతి : ఏపీలో తీసుకొస్తున్న ల్యాండ్ టైటిలింగ్(Land Titoling Act) చట్టంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కైకలూరులో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే రాష్ట్రంలో భూములను దోచేసే కొత్త చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS Jagan) తీసుకొచ్చారని మండిపడ్డారు.
మన ఆస్తి..మనదని 90 రోజుల్లో రుజువు చేసుకోలేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆరోపించారు. ప్రజల వద్ద ఉన్న ఆస్తిని ప్రభుత్వం వద్ద రుజువు చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఆధార్ కార్డు(Aadhar) ను తీసుకు రావాడానికి దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగిన తరువాత తీసుకొచ్చారని గుర్తు చేశారు. అదే ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకు రావాలంటే ఎవరి అంగీకారం అవసరం లేదా అని నిలదీశారు.
కేంద్రం తీసుకొచ్చిన చట్టం ముసాయిదా మాత్రమేనని దానిపై చర్చ లేకుండానే ఎలా అమలు చేస్తారని పేర్కొన్నారు. ప్రజల ఏపీ ప్రజల భవిష్యత్ కోసం పార్టీలను ఏకం చేసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటి చేస్తున్నామని, వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాలిలో పెట్టిన దీపంలా ఆరిపోతాయని అన్నారు. యువతను గంజాయి మత్తుకు బానిస చేస్తున్నారని, ప్రజలు నిర్భయంగా బతకాలంటే కూటమిని గెలిపించాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

