శనివారం 11 జూలై 2020
National - Jun 15, 2020 , 11:42:36

రెండ‌వ పెళ్లి చేసుకున్న కేర‌ళ సీఎం కూతురు

రెండ‌వ పెళ్లి చేసుకున్న కేర‌ళ సీఎం కూతురు

హైద‌రాబాద్‌: కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణా త‌యికండియిల్ .. ఇవాళ రెండ‌వ పెళ్లి చేసుకున్న‌ది.  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న ఆమె.. డీవైఎఫ్ఐ అధ్య‌క్షుడు పీఏ మొహ‌మ్మ‌ద్ రియాస్‌ను పెళ్లి చేసుకున్నారు.  ఇవాళ ఉద‌యం తిరువ‌నంత‌పురంలో ఈ వివాహ వేడుక చాలా సాదాసీదాగా జ‌రిగింది. స్పెష‌ల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు. సీఎం అధికార నివాసంలో కేవ‌లం కొద్ది మంది అతిథుల మ‌ధ్య వేడుక నిర్వ‌హించారు.

బెంగుళూర్‌లోని ఓ చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధిప‌తిగా వీణా ప‌నిచేస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఎక్సాలాజిక్ సొల్యూష‌న్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో ఆమె హెడ్‌గా ఉంది. మాజీ ఐపీఎస్ ఆఫీస‌ర్ పీఎం అబ్దుల్ ఖ‌దీర్ కుమారుడే రియాస్‌. చిన్న‌నాటి నుంచి రాజ‌కీయాల్లో ఉన్న రియాస్‌.. ప్ర‌స్తుతం డీవైఎఫ్ఐ అధ్య‌క్షుడిగా చేస్తున్నాడు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నుంచి పోటీ చేసిన రియాస్‌.. కేవ‌లం 838 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు.   

ఈ ఇద్ద‌రికీ ఇది రెండ‌వ పెళ్లి. ఇద్ద‌రూ 43 ఏళ్లు ఉన్నారు. రియాస్‌లో తొలిసారి 2002లో పెళ్లి చేసుకున్నాడు. 2015లో అత‌నికి డైవ‌ర్స్ అయ్యింది. రియాస్‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.  సీఎం విజ‌య‌న్ కూతురు వీణకు కూడా సంతానం ఉన్న‌ది. ఆమె 2015లో విడాకులు తీసుకున్న‌ది.  


logo