సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 14:30:22

కుప్వారాలో చొర‌బాటుదారుల కాల్పుల్లో ముగ్గురు సైనికుల మృతి

కుప్వారాలో చొర‌బాటుదారుల కాల్పుల్లో ముగ్గురు సైనికుల మృతి

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని చొర‌బాటుదారుల కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమ‌రుల‌య్యారు. కుప్వారా జిల్లాలోని మాచిల్‌ సెక్టార్‌లో ఉన్న నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఇవాళ‌ తెల్ల‌వారుజామున కొంద‌రు అనుమానాస్ప‌ద వ్య‌క్తుల క‌ద‌లిక‌ల‌ను స‌రిహ‌ద్దు గ‌స్తీ ద‌ళాలు గుర్తించారు. దీంతో వారిని అడ్డుకోగా, వారు గ‌స్తి బ‌ల‌గాల‌పై కాల్పులు జ‌రిపార‌ని స‌రిహ‌ద్దు ర‌క్ష‌క ద‌ళం (బీఎస్సెఫ్‌) వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్ర‌వాది హ‌త‌మ‌వ్వ‌‌గా, భార‌త సైన్యానికి చెందిన‌ ఇద్ద‌రు, బీఎస్సెఫ్ జ‌వాను ఒక‌రు క‌న్నుమూశార‌ని తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఒక ఏకే రైఫిల్‌, రెండు బ్యాగుల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. ఇండియ‌న్ ఆర్మీ, బీఎస్సెఫ్ సంయుక్త ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించింది.