సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Jul 15, 2020 , 16:15:09

బైక్ ను ఢీకొట్టిన ట్ర‌క్కు : ‌యువ‌కుడు మృతి

బైక్ ను ఢీకొట్టిన ట్ర‌క్కు : ‌యువ‌కుడు మృతి

మేడ్చ‌ల్ : కీస‌రకు స‌మీపంలోని నాగారంలో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. బైక్ పై వెళ్తున్న యువ‌కుడిని వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్ పై వెళ్తున్న యువ‌కుడు ప్రాణాలు కోల్పోయాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ట్ర‌క్కు డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మృతుడిని టీ సుధాక‌ర్ గా పోలీసులు గుర్తించారు. తుర్క‌ప‌ల్లి మండ‌లంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సుధాక‌ర్.. చ‌క్రీపురం వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న కీస‌ర పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo