రేషన్ బియ్యం పంపిణీ షురూ..

- ప్రతి లబ్ధిదారుడికి 12కిలోలు అందజేత
- దుకాణాల వద్ద శానిటైజర్, సబ్బు, నీళ్లు ఏర్పాటు
- సామాజిక దూరం పాటించిన వారికే బియ్యం పంపిణీ
లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా తెల్లరేషన్ కార్డు కల్గిన కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున పంపిణీ గురువారం ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిరోజు 250 రేషన్ దుకాణాల్లో ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ప్రతి షాపు ఎదుట సామాజిక దూరం పాటించేలా బాక్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చేతులు కడుక్కునేందుకు శానిటైజర్, సబ్బు, నీళ్లు ఏర్పాటు చేశామని వివరించారు. నల్లగొండ జిల్లాలో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి దుకాణాలకు బియ్యం తరలించినట్లు డీఎస్వో రుక్మిణీదేవి తెలిపారు. వార్డుల వారీగా సమాచారం అందజేసి పంపిణీ చేస్తామన్నారు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, నమస్తేతెలంగాణ: యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలం గాణ: ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చూడా లన్నదే ప్రభుత్వ లక్ష్యం.. ఆపత్కాలంలో బడుగు బల హీనవర్గాల ప్రజలకు అండగా ప్రభుత్వం నిలబడింది. సామాజిక దూరం పాటించడం అవసమరని తెలియ జేయడంతోపాటు వారి కనీస అవసరాలు తీర్చడంలో కూడా ముందుంటున్నాం.. అన్నీ అందజేస్తాం.. ఎవ రూ భయాందోళన చెందొద్దు.. పుకార్లను నమ్మకుండా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ పిలుపునిచ్చారు. దుకాణాల వద్ద సామాజిక దూరం తప్పకుండా పాటించా లన్నారు. నిర్ణీత బాక్సులోనే ఉంటూ దూరం పాటించి విజ్ఞత ప్రదర్శించాలని సూచించారు.
వివరాలు ఆయన మాటల్లోనే...
నమస్తే: జిల్లాలో మొత్తం ఎన్ని పౌరసరఫరాల దుకాణాలు ఉన్నాయి?
అదనపు కలెక్టర్: జిల్లాలో మొత్తం 481 రేషన్ దుకాణాలు ఉన్నాయి.
నమస్తే: జిల్లాలో ఎంత మందికి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగనున్నది?
అదనపు కలెక్టర్: జిల్లాలో 2,12,000 మందికి బియ్యం పంపిణీ చేయనున్నాం.
నమస్తే: ఎన్ని క్వింటాళ్ల బియ్యం పంపిణీ అలాట్ అయ్యాయి?
అదనపు కలెక్టర్: 8,300 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ అయ్యాయి. గోదాముల నుంచి డీలర్లకు కూడా చేరవేశాం.
నమస్తే: ఒక్కో వ్యక్తికి ఎన్ని కిలోల బియ్యం పంపిణీ చేస్తారు?
అదనపు కలెక్టర్: ఒక్కో వ్యక్తికి ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ చేస్తాం.
నమస్తే: ఇప్పటివరకు ఎన్ని దుకాణాల్లో రేషన్ పంపిణీ మొదలయింది?
అదనపు కలెక్టర్: 250 రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైంది.
నమస్తే: ఈరోజు ఎన్ని టన్నుల బియ్యాన్ని ప్రజలు దుకాణాల నుంచి తీసుకెళ్లారు?
అదనపు కలెక్టర్: ఈ ఒక్కరోజే 548 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ జరిగింది.
నమస్తే: బియ్యం పంపిణీ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అదనపు కలెక్టర్: అందరూ ఒకేసారి రేషన్ దుకాణాల వద్దకు చేరుకోకుండా తహసీల్దార్లు కూపన్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం నుంచి క్యూలైన్లో నిలబడకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే: సామాజిక దూరం పాటించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అదనపు కలెక్టర్: రేషన్ దుకాణం చుట్టుపక్కల రెండు మూడు రోజుల నుంచి శానిటేషన్ ఎలా ఉందనే విషయంపై ఆరా తీసి బ్లీచింగ్ చేయించాం. రేషన్ తీసుకుపోవడానికి వచ్చే వారి మధ్య ఒక్కొక్కరికి గ్యాప్ ఉండేలా బాక్సులు వేయించి,
ఆ బాక్సుల్లోనే నిలబడేలా చర్యలు తీసుకున్నాం.
నమస్తే: ఒక్కసారి కూపన్లను ఎంతమందికి అందజేస్తున్నారు?
అదనపు కలెక్టర్: ఒక్క పూటకు 50 మందికి బియ్యం ఇచ్చే విధంగా చూస్తున్నాం. బియ్యం పేరుతో గుంపులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
నమస్తే: బియ్యం పంపిణీ ఎలా చేపట్టాలనే విషయంపై ముందుగా తీసుకున్న చర్యలు ఏంటి?
అదనపు కలెక్టర్: చాలా ప్రణాళికా బద్దంగా నడుచుకుంటున్నాం. అన్నిటికన్నా ప్రధానమైన విషయం దుకాణాల వద్దకు ప్రజలు ఒకేసారి వచ్చి గుంపులుగా ఉండకుండా చూసుకోవడం.. దీని కోసం గ్రామాల్లో ముందుగానే డప్పు చాటింపు వేయించాం. ఫలానా నెంబర్ దుకాణంలో ఫలానా సమయంలో బియ్యం పంపిణీ జరుగుతుందని కూపన్లపై పేర్కొన్న నంబర్ల వారీగా ప్రజలు దుకాణాల వద్దకు చేరుకోవాలని కోరుతున్నాం.
నమస్తే: బియ్యం పంపిణీలో అవినీతి జరుగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
అదనపు కలెక్టర్: బియ్యం పంపిణీలో అక్రమాలకు తావు లేదు. ఇందుకోసం ఈ పాస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. థంబ్ ఇంప్రెషన్ ఉంటేనే బియ్యం పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఫోర్టబిలిటీ విధానంలో బియ్యం తీసుకునే అవకాశం ఉన్నది.
నమస్తే: ఎన్ని రోజులు బియ్యం పంపిణీ చేస్తారు?
అదనపు కలెక్టర్: దీనికి సమయం లేదు. రేషన్ దుకాణంలోని ప్రతి ఒక్కరి బియ్యం డీలర్ల వద్ద భద్రంగా ఉంటాయి. అవసరమున్న వారు ముందుగా తీసుకునేలా వినియోగదారులు విజ్ఞతతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. ఇంట్లో బియ్యం ఉన్న వారు కొంత ఆలస్యంగా వెళ్లి బియ్యం తీసుకుంటే మంచిది. ఎలాగూ కూపన్లు కూడా మీ వద్దనే ఉంటాయి కాబట్టి బియ్యం అయిపోతాయనే భయం కూడా ఉండదు.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!