బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
- కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలు, అభివృద్ధిని గడప గడపకూ తీసుకెళ్లాలి
- కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి
- జైనూర్‌లో ఐదు మండలాల బూత్‌స్థాయి నాయకులకు సమావేశం
- పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు
జైనూర్, ఏప్రిల్ 26 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ని కాలేజ్గూడలో ఐదు మండలాల బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సకును భారీ మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులు, బూత్‌స్థాయి నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఆసిఫాబాద్ ప్రాంతానికి మొదటిసారిగా ఎంపీ అవకాశం వచ్చిందని, ప్రజలు ఆలోచించి పార్టీలకతీతంగా తనను ఆశీర్వదిస్తే అభివృద్ధితో పాటు ప్రజా సమస్య లు పరిషరిస్తానని తెలిపారు. ఈ సమావేశం లో వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ యూనుస్ అక్బా నీ, జైనూర్ ఇంద్రవెల్లి మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆత్రం భగవంతరావు, జాదవ్ శ్రీరా మ్ నాయక్, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, నార్నూర్, గాదిగూడ మండలాల, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహకార చైర్మన్లు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

