దీర్ఘాయువుకు ‘థైమస్’ అండ.. మనిషి ఆరోగ్యానికి తోడ్పాటు
మానవుల ఆయుర్దాయంలో మన ఊహకందనంత కీలక పాత్ర పోషిస్తున్న ఒక చిన్న అవయవంపై జరిగిన అధ్యయన ఫలితాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. మానవుని రొమ్ము పైభాగాన ఉండే ఈ అతి చిన్న అవయవం దశాబ్దాలుగా గుర్తింపునకు కూడా నోచుకోకపోవడం విశేషం. అదే ‘థైమస్ గ్రంథి’.
- తాజా అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు
న్యూయార్క్ : మానవుల ఆయుర్దాయంలో మన ఊహకందనంత కీలక పాత్ర పోషిస్తున్న ఒక చిన్న అవయవంపై జరిగిన అధ్యయన ఫలితాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. మానవుని రొమ్ము పైభాగాన ఉండే ఈ అతి చిన్న అవయవం దశాబ్దాలుగా గుర్తింపునకు కూడా నోచుకోకపోవడం విశేషం. అదే ‘థైమస్ గ్రంథి’. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే ‘థైమస్ గ్రంథి’ వయసు పెరిగే కొద్దీ క్షీణించి కుంచించుకుపోతుంది. ‘ఇమ్యూన్ సెల్ గ్రేవ్‌యార్డ్'(రోగ నిరోధక కణాల శ్మశాన వాటిక)గా పిలిచే ‘థైమస్ గ్రంథి’ మనిషి పెరిగిన తరువాత కూడా తన ఉనికిని కోల్పోదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆంకాలజిస్ట్ హ్యూగో ‘సైన్స్ అలర్ట్’తో మాట్లాడుతూ పెద్దలలో కూడా ఈ ‘థైమస్ గ్రంధి’ ముఖ్యమైనది కావచ్చని, పరిశోధనల తర్వాత వచ్చిన ఫలితాలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఈ అధ్యయనంలో రెండు వేర్వేరు సమూహాల నుంచి డాటా సేకరించి విశ్లేషించింది. దీనిలో థైమస్ అత్యంత ఆరోగ్యంగా ఉన్నవారు, తక్కువ థైమస్ ఆరోగ్యంతో ఉన్నవారితో పోలిస్తే 12 ఏండ్ల తర్వాత మరణించే అవకాశం దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నదని తేలిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

