Satyadev | సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. మే 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ విడుదల చేస్తున్నాయి.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడిగా సత్యదేవ్ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ప్రతి సన్నివేశం రియలిస్టిగ్గా ఉంటుంది’ అన్నారు. అతీరారాజ్, లక్ష్మణ్, కృష్ణ, అర్చన, రఘు కుంచె, నందగోపాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: కాలభైరవ, సమర్పణ: కొరటాల శివ, నిర్మాణ సంస్థ: అరుణాచల క్రియేషన్స్, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ.