సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:35

ప్రముఖ నృత్యకారుడు భీమన్‌ ఇక లేరు

ప్రముఖ నృత్యకారుడు భీమన్‌ ఇక లేరు

  • శోకసంద్రంలో ఇందూరు కళాకారులు       

ఇందూరు: అంతర్జాతీయ పేరిణి, భరతనాట్యం, కూచిపూడి నృత్య కళాకారుడు టంగుటూరి భీమన్‌ (70) ఇకలేరు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో నివాసముండే భీమన్‌ ఇంటికి శిష్యులు వచ్చి పిలువగా..  సమాధానం రాకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి విగతజీవిగా కనిపించారు. భీమన్‌ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. భీమన్‌కు 1,400 మందికిపైగా శిష్యులు ఉన్నారు. వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పేరిణి సృష్టికర్త నటరాజ్‌ రామకృష్ణన్‌ దగ్గర భీమ న్‌ శిష్యరికం చేశారు. జీవితాంతం కళ కోసం బతికిన నిస్వార్థ కళాకారుడు భీమన్‌. ఆయనకు భార్య, కూ తురు ఉన్నారు. గతంలోనే భార్య మృతిచెందారు. భీమన్‌ స్వస్థలం తిర్మన్‌పల్లిలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 


logo