మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 18:17:51

అభివృద్ధి న‌మూనాగా తెలంగాణ‌ను మార్చిన సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్యే మ‌హిపాల్‌రెడ్డి

అభివృద్ధి న‌మూనాగా తెలంగాణ‌ను మార్చిన సీఎం కేసీఆర్‌ : ఎమ్మెల్యే మ‌హిపాల్‌రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ‌ను దేశంలోని మిగ‌తా రాష్ర్టాల‌కు అభివృద్ధి న‌మూనాగా మార్చార‌ని ప‌టాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి అన్నారు. ప‌టాన్‌చెరులోని చైత‌న్య న‌గ‌ర్‌లో రూ. 60 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన బాబు జ‌గ్జీవ‌న్ రాం క‌మ్యూనీటి హాల్‌ను ఎమ్మెల్యే నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ అభివృద్దిపై చాలామంది సందేహాలు వ్య‌క్తం చేశారు. కాగా వారంద‌రి అంచ‌నాలు త‌ప్ప‌ని నిరూపిస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. 

ఏ స‌మాజం ప‌ట్ల‌గానీ, మ‌తం ప‌ట్ల కానీ ప్ర‌భుత్వానికి వివ‌క్ష లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప‌లు అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను చేప‌ట్టార‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభం నెల‌కొన్నా రాష్ర్టంలో సంక్షేమాన్ని నిరాటంకంగా కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ హరిక్ కుమార్, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


logo