Allari Naresh | అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నది. మ్యూజికల్ ప్రమోషన్లో భాగంగా ‘హమ్మమ్మో..’ అనే మెలోడీ ప్రధాన గీతాన్ని విడుదల చేశారు. గోపీసుందర్ స్వరపరచిన ఈ పాటను యశస్వి కొండేపూడి ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్నందించారు.
‘జ్యోతిష్యాన్ని బాగా నమ్మే ఓ యువకుడు ప్రేమలో పడితే ఎదురైన సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నన్విస్తుంది. చాలా విరామం తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న ఫుల్‌లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ఇది’ అని చిత్ర బృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, ఆరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, దర్శకుడు: మల్లి అంకం.