Home
National
When The Lok Sabha Elections Are Going On The Supreme Court Has Issued A Key Verdict Regarding The Counting Of Evm Vvpats
100% వీవీప్యాట్ల లెక్కింపు కుదరదు
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులతో (100% స్లిప్పులతో) సరిపోల్చాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది.
- ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఈవీఎంలపై పిటిషన్లు కొట్టివేత
- బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్న పిటిషన్‌నూ తిరస్కరించిన ధర్మాసనం
- సింబల్ లోడింగ్ యూనిట్లను కనీసం 45 రోజులు స్ట్రాంగ్‌రూమ్‌లలో ఉంచాలి
- అభ్యర్థులు కోరుకుంటే ఈవీఎంల తనిఖీ
- ఈసీకి సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ‘ఈవీఎం-వీవీప్యాట్ల లెక్కింపు’నకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లలో పోలైన అన్ని ఓట్లను మొత్తం వీవీప్యాట్ల స్లిప్పులతో (100% స్లిప్పులతో) సరిపోల్చాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. బ్యాలెట్ పద్ధతిలోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పును వెలువరించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
- ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులన్నింటినీ పోల్చి చూడాల్సిన పని లేదు. స్లిప్పులను తీసుకుని ఓటరు మరో బాక్స్‌లో వేయాల్సిన అవసరం కూడా లేదు.
- ప్రొటోకాల్స్, సాంకేతికంగా ఈవీఎంల పనితీరు తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి.. అధికారులను అడిగి అన్ని వివరాలను తెలుసుకున్నాకే ఇది చెప్తున్నాం.
- ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను వందశాతం సరిపోల్చాలని వచ్చిన పిటిషన్లు సరికాదు.
ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కీలక ఆదేశాలు - ఈవీఎంలలో ఎన్నికల గుర్తులను లోడ్ చేశాక ఆ యూనిట్‌ను సీల్ చేయాలి. అనంతరం వీటిని కంటైనర్లలో భద్రంగా పెట్టాలి.
- ఫలితాలు వెలువడిన కనీసం 45 రోజుల వరకు ఈవీఎంలతో పాటు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపర్చాలి.
- ఎన్నికల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తే, వాటిని తనిఖీ చేసుకోవచ్చు.
- ఈవీఎంలలోని మైక్రోకంట్రోలర్లో బర్న్ చేసిన మెమొరీని ఈవీఎం తయారీదారులైన ఇంజినీర్ల సాయంతో అభ్యర్థులు ఈ తనిఖీలు నిర్వహించుకోవచ్చు.
- కంట్రోల్ యూనిట్‌లోని 5 శాతం ఈవీఎంలను, వీవీప్యాట్లను సరిపోల్చుకొని ఈ విధంగా తనిఖీ చేయించుకోవచ్చు.
- ఇందుకుగానూ ఫలితాలు వెలువడిన ఏడు రోజుల్లోగా ఫీజు చెల్లించి ఫిర్యాదుదారులు రాతపూర్వకంగా వినతి ఇవ్వాల్సి ఉంటుంది.
- ఫిర్యాదుదారే దీనికి అయ్యే ఖర్చును భరించాలి.
- ఒకవేళ ఈవీఎంలు ట్యాంపర్ అయినట్టు ఈ తనిఖీల్లో తేలితే.. అభ్యర్థులు చెల్లించిన ఫీజును తిరిగి ఇచ్చేయాలి.
కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: మోదీ
సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షానికి ఇది చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై అపనమ్మకాన్ని సృష్టించినందుకు క్షమా పణ లు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

